తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ టికెట్స్ 2022 ఆన్లైన్ బుకింగ్

తిరుపతి బాలాజీ సుప్రభాత సేవ టికెట్స్ ఆన్లైన్ బుకింగ్, సుప్రభాత సేవ లక్కీ డిప్ 2022. టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత దర్శనం సేవ టికెట్స్ వివరములు.

దక్షిణ భారత దేశం లో కొలువు అయ్యిఉంన శ్రీనివాసుని సుప్రభాత గీతం వినని ప్రజలే ఉండరు. ప్రతి రోజు ఉదయం శ్రీనివాసుని సుప్రభాత ఆలాపన తో తిరుమల కొండ పైన ఉన్న భక్తులు శ్రీవారి తోలి దర్శనం చేసుకుంటారు. 12వ శతాబ్దము లో ప్రతివాది భయంకర అన్నన్ అనే భక్తుడు విరచించిన “కౌసల్య సుప్రజా రామా….” అని మొదలుకొని షుమారు 12 నిమిషాల పటు శ్రీనివాసుని మేల్కొల్పే భక్తి కీర్తనలు చివరకు మంగళశాసన స్త్రోత్రం తో ముగుస్తాయి. ప్రతి లోగిలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అనేది వినిపిస్తూ ఉంటుంది.

టీటీడీ సామాన్య భక్తులకు శ్రీవారి సుప్రభాత సేవ లో పాల్గొనేందుకు చక్కని అవకాశం COVID-19 తరువాత ఏప్రిల్ 2022 నుండి కల్పిస్తుంది. ప్రస్తుతం సేవలు మొత్తం స్వామి వారికీ ఏకాంతంగా జరుపుతున్నారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆన్లైన్ బుకింగ్ ద్వారా సుప్రభాత దర్శనం టికెట్స్ పొందావచ్చు. ఒక సుప్రభాత సేవ టికెట్ ధర 120రూ గా నిర్ణయించబడింది. ఆన్లైన్ నందు ఒక టికెట్ లో ఇద్దరు గరిష్టంగా బుక్ చేసుకొనవచ్చును. ఈ సేవలో పాల్గొనే భక్తులు స్వామి వారిని అతిదగ్గరగా అంటే మొదటి గడప ముందు నుంచి దర్శనం చేసుకొనే వీలు ఉంటుంది. ఏ రోజులోనైనా శ్రీవారి సుప్రభాత దర్శనం సేవ తోనే మొదలు అవుతుంది.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ దర్శనం జరిగే విధానం:

మంగళాకారుడైన శ్రీనివాసుని సుప్రభాతం ప్రతి రోజు వేకువన 2:00 లకు మొదలు అవుతుంది. శ్రీవారి సేవకోసం పురోహితులు, అర్చక స్వాములు ఆకాశ గంగ నీరు తీసుకునివచ్చి మూసినా బంగారు వాకిలి వెలుపల అనగా జయ విజయముల ఎదురుగా సుప్రభాత గీతాలాపన తో సేవను మొదలు పెడుతారు. శ్రీవారి సుప్రభాత గానం అయ్యాక మంగళాష్టకం తో ముగిస్తారు. వీరితో పటు అన్నమాచార్య వంశస్తులు ఒకరు మరియు సన్నిధి గొల్ల ఒకరు సుప్రభాత సేవలో ముఖ్య పాత్ర వహిస్తారు.

శ్రీవారి బంగారు వాకిలి తలుపులు ఒక ప్రత్యేకమైన కొక్కెం తో లోపల గడి తీసి మొదట శుద్ధి చేసి, ముందు రోజు జరిపిన ఏకాంత సేవ లో ఉన్న ఉత్సవ మూర్తులను మరల యధా స్థానంలో పెట్టి, అంతరాలయం నందు దీపారాధన చేసి, స్వామి వారికి హారతి ఇచ్చి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఒక రోజులో 700 మంది భక్తులు షుమారుగా సుప్రాభాతసేవ లో పాల్గొంటారు. శ్రీవారి ఆలయం లో జరిగే సేవలలో సుప్రభాత సేవ మాత్రమే ప్రతినిత్యం నిర్వహిస్తారు.

ముందుగా శ్రీవారిని సుప్రభాత దర్సనం లో తిరుమల దేవస్థానం ఉద్యోగులు, వీవీఐపీ భక్తులు, ఉదయాస్తమాన సేవ పోషకులు, ప్రోటోకాల్లో వచ్చిన ముఖ్య అతిధులను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తరువాత ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకు అదే దర్శన భాగ్యం కల్పిస్తారు. ఒక సుప్రభాత సేవ టిక్కెట్టునకు ఒక చిన్న లడ్డును ప్రసాదంగా ఇస్తారు.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ విధానం:

శ్రీవారి సుప్రభాత సేవ టికెట్స్ ను 2018 వరకు ఆన్లైన్ లో 60 రోజులకు ముందుగా విడుదల చేసేవారు., కానీ వీటికి ఉన్న విశేష స్పందన మరియు డిమాండ్ వలన ఇంటర్నెట్ లేని భక్తులకు సేవ టికెట్స్ దొరకడం బాగా ఇబ్బందిగా మారింది. డయల్ యువర్ ఈవో కార్యక్రమం లో ఎప్పుడు కంప్లైంట్స్ వస్తుండడం వలన ఒక నెల టికెట్స్ మొత్తం కూడా ఒకే రోజున విడుదల చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇది కొంచెం మెరుగుగా పనిచేసినా కానీ భక్తులు ఆశించిన స్థాయి లో విజయవంతం కాలేదు.

అందువలన శ్రీవారి అందుతరాలయ దర్శనం పొందగలిగే సుప్రభాత సేవ లాంటి టికెట్స్ కోసం ఎవరైనా సరే లక్కీ డిప్ ద్వారా రాండమ్గా టికెట్స్ పొందే వీలు కలిపించారు. లక్కీ డిప్ రిలీజ్ అయ్యే రోజున భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైటు లోనికి లాగిన్ అయ్యి వారి ఆధార్ నెంబర్ ద్వారా పాల్గొనచ్చు.

తిరుమల ఆన్లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు సమాచారం

సుప్రభాత సేవ లో పాల్గొనే భక్తులకు సూచనలు మరియు గమనించ వలసిన విషయాలు:

సుప్రభాత సేవకు వెళ్లే భక్తులను సాంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతిస్తారు.

సేవ మొదలు అయ్యే సమయానికి 30 నిమిషాల ముందు VQC గేట్ 2 నందు టికెట్తో పాటు వారి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఆలయ అధికారులు చెక్ చేస్తారు.

ఆన్లైన్ లక్కీ డిప్ లో కాకుండా మరి ఏ ఇతర మార్గాలలో శ్రీవారి సుప్రభాత దర్శనం టిక్కెట్లు ఇవ్వబడవు.

సుప్రభాత స్త్రోత్రంను పండితులు పాటించే సమయంలో నిశ్శబ్దముగా ఉన్నచో మీరు ఆ సేవ యొక్క అనుభూతి పొందగలరు. దర్శన సమయం లో మీరు సత్ప్రవర్తన లేనిచో సేవ నుండి వెలుపలకు వెళ్ళవలసి ఉంటుంది.

సిఫారసు లేఖల ద్వారా సుప్రభాత దర్శన సేవలు ఎట్టి పరిస్థితులలో ఇవ్వబడవు.

Leave a Reply

%d bloggers like this: