తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు ఆన్లైన్ బుకింగ్ | TTD ఆర్జిత సేవా టికెట్స్ 2022

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ 2022 కళ్యాణోత్సవం, విశేష పూజ, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ, డోలోత్సవం/ఉంజల్ సేవ, ఆన్లైన్ విడుదల. ఏప్రిల్, మే, జూన్, జులై 2022 తిరుమల ఆర్జిత సేవ టికెట్స్.

తిరుమల నందు శ్రీవారి దర్శన భాగ్యమే విశేషంగా భక్తులు అనుభూతి చెందుతారు. అటువంటి శ్రీవారి ఆలయం లో జరిగే విశేషమైన సేవలు ప్రతీ యాత్రికునికి ఒక అద్భుతమైన వరం. TTD పాలక మండలి 2022 ఏప్రిల్ నుండి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్స్ ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది. తిరుపతి బాలాజీ గుడి నందు వివిధ సేవలు అందుబాటు కానున్నాయి.

శ్రీవారి ఆలయం నందు ప్రతి నిత్యం కొన్ని సేవలు సామాన్య భక్తులను అనుమతిస్తారు. సాధారణంగా శ్రీవారి మూలవిరాట్టు దర్శనం కొన్ని క్షణములు మాత్రమే వీలుపడతుంది, కానీ ఆర్జిత సేవలలో భక్తులు 5 నుండి 45 నిమిషాల వరకు శ్రీవారిని మనస్ఫూర్తిగా అతి దగ్గర నుండి కన్నుల పండుగగా చూడవచ్చు.

తిరుమల TTD బాలాజీ ఆర్జిత సేవ టికెట్స్ వివరాలు 2022:

ఈ సేవలలో కొన్నిటికి అంతరాలయ దర్శనం మరియు కొన్నింటికి సాధారణ దర్శనం కల్పిస్తారు. ఈ సేవలలో మూలవిరాట్టుకు జరిగేవి కొన్ని అయితే మిగిలినవి మలయప్ప స్వామి మరియు శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలకు జరుపుతారు. మూలవిరాట్టు దర్శనానికి అనుమతించే సేవలను TTD ఆన్లైన్ లక్కీ డిప్ నందు భక్తులకు కేటాయిస్తారు. ఉత్సవ విగ్రహానికి జరిగే వాటి టికెట్స్ వెబ్సైటు నందు బుక్ చేసుకోనవచ్చును. గరిష్టంగా ఇద్దరు భక్తులకు ఒకసారి టికెట్ బుక్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది.

ఆన్లైన్ లో విడుదల చేసే శ్రీవారి తిరుమల ఆర్జిత సేవ టికెట్స్ 2022:

 • కల్యాణోత్సవం సేవ
 • ఉంజల్ సేవ / డోలోత్సవం
 • ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ
 • వసంతోత్సవం
 • సహస్రదీపాలనకరణ సేవ
 • చతుర్థశ కలశ విశేష పూజ

తిరుమల లక్కీ డిప్ నందు విడుదల చేసే శ్రీవారి ఆర్జిత సేవలు:

 • సుప్రభాత దర్శనం సేవ
 • అష్టదళ పాద పద్మారాధనము సేవ
 • సహస్రనామ అర్చన సేవ
 • తోమాల సేవ
 • నిజపాద దర్శనం

ఆన్లైన్ లో ఏప్రిల్ మే జూన్ జులై 2022 శ్రీవారి ఆర్జిత సేవలు బుక్ చేసుకునే తేదీలు:

ఆర్జిత సేవలు ఆన్లైన్ లో విడుదల చేసే రోజు:

ఆర్జిత సేవలు తరువాత ఆన్లైన్ లో తిరుమల కొండ పైన రూమ్స్ / వాసతి బుక్ చేస్కునే తేదీ:

శ్రీవారి తిరుమల ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు నియమాలు & ముఖ్య గమనిక:

 • ఒక టికెట్ పైన 2రు భక్తులను మాత్రమే అనుమతిస్తారు. వీరితో పటు 12 సంవత్సరముల కంటే తక్కువ వయసున్న 2 పిల్లను కూడా అనుమతిస్తారు.
 • టిక్కెట్ ఒక్కసారి జారీ అయ్యిన తరువాత అందులో ఎటువంటి మార్పులను మరియు క్యాన్సల్ చేసుకోటానికి వీలుండదు.
 • సేవ టికెట్ పొందిన భక్తులు ఏ కారణం చేత పాల్గొనక పోయిన టికెట్ డబ్బులు వాపసు ఇవ్వబడదు.
 • ఆర్జిత సేవ టికెట్ కలిగిన భక్తులు శ్రీవారి దర్శనానికి సాంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతిస్తారు.
 • Covid 19 వాక్సిన్ సిర్టిఫికెట్ మరియు ఆధార్ ధ్రువపత్రం ను తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది.
 • ఒక్కసారి ఆర్జిత సేవ లో పాల్గొంటే ఆ త్తరువాత 6 నెలలు తిరిగి ఆన్లైన్ లక్కీ డిప్ లో పాల్గొనలేరు. కళ్యాణం లాంటి సేవలో పాల్గొంటే 3 నెలలు వేచి ఉండాలి.
 • ఆర్జిత సేవ టికెట్ పైన ఉన్న సమయం లో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. సేవలో పాల్గొన్న తరువాతనే దర్శనం చేసుకునే వీలు ఉంటుంది.
 • టికెట్ బుకింగ్ సమయం నందు మనీ కట్ అయ్యి టిక్కెట్ బుకింగ్ ఫెయిల్ కనుక అయితే డబ్బు రిఫండ్ వస్తుంది కానీ సేవ టికెట్ ఇవ్వబడదు. మరిన్ని సూచనలకు టీటీడీ కాల్ సెంటర్ కు ఫోన్ చేయండి.

తిరుమల TTD ఆర్జిత సేవలు ఆన్లైన్ లో బుక్ చేసుకొనే విధానం:

భక్తులకు TTD తన అన్ని న్యూస్ మరియు ఆన్లైన్ వెబ్సైటు tirupatibalaji.ap.gov.in మెయిన్ పేజీ నందు ప్రతి నెల సేవ టికెట్స్ రిలీజ్ చేసే తేదీలను ప్రకటిస్తారు.

సేవ టికెట్స్ బుక్ చేసికోదలచిన వారు ముందుగా TTD వెబ్సైటు నందు లాగిన్ అయ్యి ఉండాలి. మీకు గనుక టీటీడీ యూసర్ లాగిన్ పాస్వర్డ్ లేనట్లయితే రిజిస్టర్ చేసొవాలి.

తిరుమల వెబ్సైటు నందు లాగిన్ చేసి శ్రీవారి సేవ, తిరుమల అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.

అక్కడ ఏ ఏ తేదీలలో టికెట్స్ అందుబాటు లో ఉన్నాయో ఆ తేదీల బటన్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. మీకు కావలిసిన తేదీని ఎంచుకోండి. క్రింద ఎన్ని టికెట్స్ కావాలోఅన్ని సెలెక్ట్ చేసుకోండి. కల్యాణోత్సవం సేవ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వబడుతుంది.

తిరుమల రూల్స్ మరియు బుకింగ్ నియమాలు అన్నిటిని ఒప్పుకుంటున్నట్లుగా మీరు ఒక టిక్ మార్క్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

తరువాత భక్తుల పేర్లు, వయసు, జెండర్, ఆధార్ కార్డు నెంబర్, బుకింగ్ యొక్క ఫోన్ నెంబర్ మొత్తం వివరాలను ఇవ్వండి.

ఒకసారి అన్ని సరి చూసుకొని ఆన్లైన్ పేమెంట్ కొరకు Pay online బటన్ను ప్రెస్ చేయండి.

మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు లేదా ఎటిఎం కార్డు లేదా యూపీ అప్ ద్వారా ట్రాన్సాక్షన్ను కంప్లీట్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ జరిపే సమయం నందు మీరు రిఫ్రెష్ లేదా బ్యాక్ బటన్ ను ప్రెస్ చేయవద్దు.

ఒక్కసారి పేమెంట్ కనుక విజయవంతమైతే మీ టికెట్ను బుకింగ్ హిస్టరీ లోనుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: