తిరుమల టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ లక్కీ డిప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2022

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ 2022 టీటీడీ లక్కీ డిప్ సెలక్షన్ లిస్ట్. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవ, నిజపాద దర్శనం లక్కీ డిప్ ఆన్లైన్ బుకింగ్.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే సేవలు అనిర్వచనీయం మరియు అత్యద్భుతం. ఒక్కసారి అయినా సరే భక్తులు ఎదో ఒక సేవలో పాల్గొనాలి అని ఆశతో అవకాశం కోసం చూస్తుంటారు. టీటీడీ తన పారదర్శకమైన విధానంతో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ లో టీటీడీ లక్కీ డిప్ ద్వారా భక్తులకు విడుదల చేస్తుంది. సాధారణంగా పరిమిత సంఖ్యలో ఉండే సేవ టిక్కెట్లను ఎక్కువ సంఖ్యలో ఇవ్వడానికి ఆలయం నియమాల పరంగా సాధ్యపడదు. అందువలన కేవలం 50 10 150 సంఖ్యలో ఉండే టిక్కెట్లు చాల వేగంగా బుక్ చేస్తుంటారు. భక్తుల విన్నపాలు మరియు వివిధ సాంకేతిక సమస్యల పరిస్కారం కోసం కంప్యూటర్ ఆధారిత లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల టికెట్స్ టీటీడీ విడుదల చేస్తుంది.

టీటీడీ తిరుమల లక్కీ డిప్ 2022 ద్వారా విడుదల చేసే ఆర్జిత సేవలు:

సుప్రభాత దర్శనం సేవ: ఈ సేవ ప్రతిరోజూ ఉదయం 2:00 గం!!లకు మొదలు అవుతుంది. ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా ఒక రోజుకు 75 నుండి 100 వరకు టికెట్స్ విడుదల చేస్తారు. ఒక టికెట్ పైన 2 భక్తులు వెళ్లేందుకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ సమయంలో ఎంచుకోవచ్చు. ఈ సేవ వేల ఒక టిక్కెట్టుకు 120 రూపాయలు మాత్రమే.

తోమాల సేవ: తోమాల సేవ కేవలం మంగళ, బుధ, గురువారం మాత్రమే విడుదల చేస్తారు. ఇవి కేవలం 20 టికెట్స్ మాత్రమే ఉంటాయి. కరెంటు బుకింగ్ ద్వారా ఇవ్వాల్సిన టికెట్స్ కూడా ఆన్లైన్ లక్కీ డిప్ కు బదలీ చేసారు. తోమాల సేవ ఉదయం 3:00 గం!!లకు మొదలు అవుతుంది. ఈ సేవ వేల 220 రూపాయలు మాత్రమే.

అర్చన సేవ: ఈ సేవ కూడా తోమాల సేవలాగానే మంగళ, బుధ, గురువారం రోజులలో మాత్రమే పొందేందుకు వీలుంటుంది. ఇవి కూడా 20 టికెట్స్ మాత్రమే ఉంటాయి. తోమాల సేవ జరిగిన వెంటనే అర్చన సేవ జరుగుతుంది. ఈ సేవ వేల 200 రూపాయలు మాత్రమే.

అష్టదళ పాదపద్మారాధనము సేవ: ఈ సేవ పేరులోనే ఉన్నది ఇది ఒక ప్రత్యేకమైనటు వంటి సేవయని. శ్రీవారికి ఒక ముస్లిం భక్తుల కుటుంబం సమర్పించిన 108 బంగారు తామర పద్మ పూవులతో అష్టోత్తర పూజ చేస్తారు. ఈ సేవ వెల 1250 రూపాయలు. శ్రీవారికి ఈ సేవ కేవలం మంగళవారం మాత్రమే జరుపుతారు.

నిజపాద దర్శనం సేవ: ఈ దర్శనం టికెట్స్ కేవలం శుక్రవారం మాత్రమే విడుదల చేస్తారు. ఈ దర్శనం టికెట్స్ ఒక రోజుకు 150 వరకు ఇస్తారు. నిజపాద దర్శనం లో శ్రీవారి దివ్యమైన పాదాలు మన కాంటితో చూడవచ్చు. ఒక టికెట్ వేళా 200 రూపాయలు. శ్రీవారి శుక్రవారాభిషేకం తరువాత నిజపాద దర్శనం భక్తులను అనుమతిస్తారు.

టీటీడీ లక్కీ డిప్ టికెట్స్ ఏప్రిల్ మే జూన్ 2022 కొరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్:

శ్రీవారి భక్తులు టీటీడీ ద్వారా లభించే ఆర్జిత సేవ టికెట్స్ కేవలం tirupatibalaji.ap.gov.in ఆన్లైన్ వెబ్సైటులో రిజిస్టర్ లక్కీ డిప్ రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే పొందగలరు.

ఆన్లైన్ టీటీడీ లక్కీ డిప్ 2022 కోసం మార్చ్ 20వ తేదీన ఉదయం 10:00 నుండి లక్కీ డిప్ సేవ టికెట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక భక్తుడు తన ఆధార్ నెంబర్ను ఉపయోగించి మాత్రమే సేవ టికెట్ కోసం రిజిస్టర్ చేసుకొనగలరు.

మొదట మీరు మీ టీటీడీ యూసర్ ID ద్వారా లాగిన్ అవ్వండి. అక్కడ మెనూ లో టీటీడీ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. లక్కీ డిప్ మెనూ లో సేవ పేరు ఏ ఏ రోజులు టికెట్ ఉన్నవి, మొదలగు ఆప్షన్స్ అన్ని మీరు మీకు అనుగుణంగా సెలెక్ట్ చేసుకోండి. అన్ని సేవలకు మరియు అన్ని రోజులకు ఒక నెల లో ఒకే సరి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.

మీకు ఏవైనా ప్రత్యకే రోజులలో మాత్రమే సేవ టికెట్స్ కావాలి అంటే ఆ తేదీలను మాత్రమే సెలెక్ట్ చేయండి.

ఈ సరి టీటీడీ 3 నెలలు అనగా ఏప్రిల్ మే జూన్ లకు లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవలు పొందే అవకాశం కల్పించారు. అందువలన మీరు 3 నెలల రిజిస్ట్రేషన్ కోసం మూడు జాలర్లు సెలెక్ట్ అల్ ఆప్షన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది.

ఒక్కసారి మీరు సెలక్షన్ పూర్తి అయ్యాక మీరు మీ ఆధార్ నంబర్స్, పేరు, ఏజ్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ అడ్రస్ని నింపండి. అన్ని డీటెయిల్స్ కారెక్ట్ గా ఉన్నట్లైతే మీరు డిప్ రిజిస్ట్రేషన్ ఒప్షన్స్ ని లాక్ చేసి ఫినిష్ బటన్ ప్రెస్ చేయండి. ఒక యూనిక్యూ రిజిస్ట్రేషన్ ID నెంబర్ మీద మీ లక్కీ డిప్ టోకెన్ ఇవ్వబడుతుంది.

తిరుమల లక్కీ డిప్ ఆర్జిత సేవ సెలక్షన్ లిస్ట్ & రిసల్ట్ చూసుకునే విధానం:

ఒకసారి టికెట్స్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ సమయం ముగిసిన తరువాత టీటీడీ వెబ్సైటు లక్కీ డిప్ తీయటం మొదలు పెడుతుంది. ఇందులో ఎటువంటి మానవ జోక్యం ఉండదు. డిప్ తీయటం ముగిసాక టికెట్స్ కోసం సెలెక్ట్ చేయబడిన ప్రతిఒక్కరికి ఒక SMS వారి మొబైల్ నెంబర్ కు వెళ్తుంది. ఆ మెసేజ్ లో వారికీ ఏ సేవ టికెట్ మరియు ఆ రోజున సెలేక్ట్ అయ్యిందో పేమెంట్ లింక్ తో సహా అన్ని వివరాలు ఉంటాయి. ఒక వేల ఏ పరిస్థితి వలన మొబైల్ sms రాకపోతేను మీరు టీటీడీ వెబ్సైటు హోంపేజిలో లక్కీ డిప్ రెసుల్త్ లింక్ సెలెక్ట్ చేయండి.

అక్కడ మీరు మొబైల్ నెంబర్ లేదా, ఆధార్ నెంబర్ లేదా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా సేవ టికెట్ మీకు వచ్చిందో లేదో మీరు తెలుసుకోవచ్చు. ఏ కారణం చేయనైనా మీరు టికెట్ పొందకపొతే తిరిగి మీరు మరుసటి లక్కీ డిప్ లో పాల్గొనచ్చు. టికెట్ వచ్చిన భక్తులు సేవ జరిగిన 180 రోజుల తర్వాతనే మరల రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Leave a Reply

%d bloggers like this: