తిరుమలలో రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ – గెస్ట్ హౌస్, వసతి గదులు రిజర్వేషన్

తిరుమలలో సులభంగా రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ రిజర్వేషన్ చేసుకోండి. తిరుమల గెస్ట్ హౌసులు, మఠములు, కాటేజీలు, సత్రములలో రూమ్స్ అడ్వాన్స్డ్ బుకింగ్.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు ప్రతి రోజు వేల సంఖ్య లో భక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబ సమేతంగా తిరుమల చేరుకొని దర్శనానికి ఒక రోజు మరియు తిరుమల కొండ పైన ఉన్న ఇతర ప్రదేశాలు చూడటానికి వసతి గదులు టీటీడీ భక్తులకు కరెంటు బుకింగ్ మరియు అడ్వాన్స్డ్ ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా కేటాయిస్తుంది భక్తుల సౌలబ్యానికి టీటీడీ 100రూ నుండి 5000రూ వరకు వివిధ వసతులతో కూడిన అద్భుతమైన కాటేజీలు, దేవస్థానం వారి గెస్ట్ హౌసులు కేవలం ఒక రోజు అనగా 24 గంటలు ఉండటానికి మాత్రమే అద్దెకు ఇస్తుంది.

ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకునే భక్తులు కేవలం tirupatibalaji.ap.gov.in వెబ్సైటు లో మాత్రమే రిజర్వేషన్ చేసుకోవాలి. కేవలం దర్శనం లేదా ఆర్జిత సేవల టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకునే వీలు ఉంటుంది. ముఖ్యంగా తిరుమల లో ప్రైవేట్ హోటల్స్, లాడ్జిలు, డార్మిటరీలు వంటివి అసలు ఉండవు. భక్తులు కేవలం దేవస్థానం వారి రూమ్స్ లో లేదా వివిధ మఠంలలో లేదా అన్నసత్రములలో ఉండగలరు. రూమ్ లేని వారు ఉచిత సేఫ్టీ లోకెర్స్ తీసుకొని వెయిటింగ్ హాల్ లో ఉండగలరు.

తిరుమలలో అద్దె గదులు వాసతి గదులు కాటేజీలు ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం:

tirupatibalaji.ap.gov.in వెబ్సైటు లోకి వెళ్లి మీరు మీ యూసర్ ఇడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి.

మీరు 300రూ దర్శనం లేదా ఆర్జిత సేవ బుక్ చేసుకుని 4 రోజుల సమయం తరువాత వెబ్సైటు రూమ్స్ రిజర్వేషన్ విడుదల చేస్తుంది.

భక్తులు కేవలం 24గంటలు మాత్రమే ఒక గదిని రిజర్వు చేసుకోవచ్చు. సాధారణంగా 6 గం!! చెక్ ఇన్ టైం స్లాట్ ఇస్తారు. ఒక్కసారి చెకిన్ టైం తర్వాత వెళితే రూమ్ రిజర్వేషన్ క్యాన్సల్ అయిపోతుంది.

స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉన్న భక్తులు ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకోవటానికి https://online.tirupatibalaji.ap.gov.in/login?flow=sed లింక్ లో వెయిటింగ్ టైం తరువాత మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. దర్శనం బుక్ చేసుకున్న వారికీ మాత్రమే రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత వెరిఫికేషన్ కోడ్ మరియు వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అక్కడ తిరుమల రూమ్స్ కాళీ గా ఉన్న తేదీల కేలండర్ కనిపిస్తుంది.

మీకు నచ్చిన తేదీని సెలెక్ట్ చేసుకొని ఆ తరువాత్త మీరు ఏ చెక్ ఇన్ స్లాట్ కుదురుతుందో ఆ టైం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. 6గం!! నిడివితో ఒక స్లాట్ లెక్కన 4 టైమింగ్స్ ఉంటాయి. ఉ!! 00:00 నుండి 6:00 AM వరకు, 6:00 AM నుండి 12:00 PM వరకు, 12:00 PM నుండి 6:00 PM వరకు 6:00 PM నుండి 12:00 PM వరకు ఒప్షన్స్ ని సెలక్ట్ చేసుకోవచ్చు.

తెల్లవారు ఝామున తిరుమల కోండ పైన రూమ్ బుక్ చేసుకున్న భక్తులు అలిపిరి గేట్ మూసివేయక ముందే తిరుమల ఘాట్ పైకి చేరుకోవాలి. లేనిచో కొన్ని సందర్భాలలో రూమ్ చెక్ ఇన్ టైం దాటిపోతుంది.

టైం స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు 100రూ, 500రూ, 1500రూ రూమ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఆ తరువాత ఎంత మంది ఒక రూమ్ లో ఉంటారో ఎంటర్ చేయండి.

అన్ని వివరాలు ఇచ్చాక మీరు ఆన్లైన్ పేమెంట్ కోసం PAY ONLINE బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ పేమెంట్ అయ్యాక తిరుమల రూమ్ రిజర్వేషన్ రెసిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి.

Leave a Reply

%d bloggers like this: