తిరుమల 300రూ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ | తిరుపతి బాలాజీ దర్శనం.

తిరుమల తిరుపతి బాలాజీ శ్రీవారి 300రూ స్పెషల్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ ఏప్రిల్ మే జూన్ జులై 2022 విడుదల @ tirupatibalaji.ap.gov.in | TTD Special Entry Darshan 300rs Online Booking starts now.

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆన్లైన్ టికెట్స్ ప్రతి నెల చివరి శుక్రవారం టీటీడీ వెబ్సైటు లో బుక్ చేసుకొనవచ్చును. ఇంత క్రితం వరకు భక్తులు నేరుగా 300 స్పెషల్ దర్శన్ కౌంటర్ నందు బుక్ చేసుకునేవారు. కానీ ఒక రోజుకు 70 నుండి 90 వేలమంది వస్తుండడంతో టీటీడీ బోర్డు 50రూ టోకెన్ దర్శనం స్థానం లో 300రూ ప్రతేయక ప్రవేశ దర్శనం అడ్వాన్సుడు ఆన్లైన్ బుకింగ్ ద్వారా తీసుకొనివచ్చింది.

భక్తులు నేరుగా తమ మొబైల్ నెంబర్ ఉపయోగించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైనవి భక్తుల ఆధార్ నెంబర్ లేదా పాస్పోర్ట్ నెంబర్ లేదా ఓటర్ id కార్డు, ఫోన్ నెంబర్, బుకింగ్ తేదీ. ఒక రోజునకు 25000 టిక్కెట్లు భక్తులు బుక్ చేసుకునేందుకు అనుమతించారు, అందులో 12 టైం స్లాట్స్ లలో ఏవైనా ఒక స్లాట్ నందు గరిష్టంగా 6 టికెట్స్ బుక్ చేసుకునే వీలు ఉంది. ఒక మొబైల్ నెంబర్ పైన టికెట్స్ బుకింగ్ పరిమితి ఏమి లేదు. ఒక్కసారి శ్రీవారి దర్శనం పొందిన భక్తులు అదే గుర్తింపు కార్డు పైన 3 నెలల తరువాత తిరిగి బుక్ చేసుకునే అవకాశం కలదు.

తిరుమల శ్రీవారి 300రు స్పెషల్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ విధానం:

టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్స్ విడుదల ఆన్లైన్ లో ప్రతి నెల చివరి శుక్రవారం 9 గంటలకు మొదలు అవుతుంది. ఇందుకు సంబందించిన వివరాలు వెజిటే లోని హోమ్ పేజీ లో పొందుపరుస్తారు.

సాధారణంగా భక్తులు పెద్ద ఎత్తున బుకింగ్ కోసం ప్రయత్నిస్తారు, అందువలన వర్చ్యువల్ వెయిటింగ్ Q సిస్టం ని టీటీడీ అందుటులోకి తీసుకొనివచ్చింది. ఎవరైనా ఒకసారి తిరుమల వెబ్సైటు లో ప్రత్యేక దర్శనం లింక్ క్లిక్ చేసాక వారు Q లో చేర్చబడి లాగిన్ కోసం టైమర్ కనిపిస్తుంది.

వెయిటింగ్ టైం అయ్యాక మొబైల్ నెంబర్ని ఇచ్చి ఓటీపీ మెసేజ్ కోసం వెయిట్ చేయాలి. ఓటీపీ వచ్చాక అది ఎంటర్ చేసి CAPTCHA కోడ్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత టికెట్స్ ఎప్పుడు కాళిగా ఉన్నాయో ఆ క్యాలెండరు డేట్స్ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి.

మీకు నచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకొని, టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ టైం స్లాట్ లో ఎన్ని టికెట్స్ ఉన్నాయో దానిని పట్టి మీ టికెట్ విజయవంతంగా బుక్ చేసుకోవచ్చు.

కిందకు స్క్రోల్ చేసి మీకు ఎన్ని టికెట్స్ కావాలో అక్కడ అన్ని ఎంటర్ చేయండి. Covid 19 నిబంధనలు ఒప్పుకుంటున్నటుగా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ బటన్ నొక్కండి. ఎవరికైనా ఎక్స్ట్రా లడ్డులు కావలసి వస్తే 20 లడ్డుల వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్క లడ్డుకు 50రూ లెక్కన మీరు పే చేయవలసి వస్తుంది.

ఇప్పుడు త్వరగా మీరు భక్తుని పేరు, వయస్సు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ లో తప్పు ఉంటె బుకింగ్ సాధ్యపడదు. కాబట్టి మీ ఆధార్ నెంబర్ ని సరిగా ఎంటర్ చేయండి.

ఒక టికెట్ లోని అందరి వివరాలు మీరు ఇచ్చాక పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని పేమెంట్ పూర్తి చేయండి.

పేమెంట్ పూర్తి అయ్యాక మీరు టికెట్ ని డైరెక్ట్ డౌన్లోడ్ లేదా ఇమెయిల్ అడ్రస్కు పంపించుకోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: