తిరుపతి బాలాజీ స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఆర్జిత సేవలు, సర్వదర్శనం మరియు వసతి గదులు

టీటీడీ శ్రీ వెంకటెశ్వర స్వామి 300రూ శీఘ్ర దర్శనం, తిరుమల ఆర్జిత సేవలు సంక్షిప్త సమాచారం. తిరుమల దర్శనం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ, లేటెస్ట్ సమాచారం.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన భారత దేశం లో అత్యంత ప్రసిద్ద పుణ్య క్షేత్రం మరియు అతి ఎక్కువ జన ఆదరణ కలిగినది. ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. నిత్యకళ్యాణం పచ్చతోరణం అంటువంటి పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. భక్తులు ప్రతి రోజు విరివిగా స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఒక రోజులో షుమారు 60 నుండి 90 వేల మంది జనం తిరుమల కొండ మీదకు వస్తుంటారు. ఇంతటి మహా పుణ్యక్షేత్రం నిర్వహణ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానమ్స్) బోర్డు సమర్ధవంతంగా నడుపుతుంది.

భక్తుల అవసరార్ధం తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఆర్జిత సేవలు, సర్వదర్శనం మరియు వసతి గదులు అడ్వాన్స్డ్ బుకింగును ఆన్లైన్ లో tirupatibalaji.ap.gov.in వెబ్సైటులో యూజర్గా రిజిస్టర్ అయ్యి అన్ని సర్వీసులులను పొందవచ్చు. తిరుమల వెబ్సైటు నందు డొనేషన్స్ మరియు స్వామి వారి హుండీ లోనికి నేరుగా మనం నగదు రూపేణా కానుకలు సమర్పించవచ్చు. తిరుమలతో పాటు తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, తిరుపతి, ఒంటిమిట్ట లాంటి ఇతర దేవస్థానాల ఆర్జిత సేవలు మరియు దర్శనం టికెట్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేందుకు టీటీడీ వెబ్సైటు వీలు కలిపిస్తుంది.

తిరుమల ఆన్లైన్ వెబ్సైటు నందు లభించు ఆన్లైన్ సేవలు మరియు వివరములు:

 1. శ్రీవారి 300రూ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్.
 2. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు అడ్వాన్స్డ్ బుకింగ్.
 3. తిరుమల కొండా మీద దేవస్థానం రూమ్స్ & గదులు ఆన్లైన్ రిజర్వేషన్.
 4. శ్రీవారి ట్రస్ట్ కు విరాళాలు సమర్పించడం.
 5. శ్రీవాణి (SRIVANI) ట్రస్ట్ కు విరాళాలు మరియు VIP దర్శనం బుకింగ్.
 6. ఉదయాస్తమాన సేవ టికెట్స్ డొనేషన్స్.
 7. TTD ఆర్జిత సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్.
 8. శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు, ప్రచూరణలు ఆన్లైన్ లో బుక్ చేసుకొనుట.
 9. తిరుపతి, తిరుచానూరు మొదలగు దేవస్థానాల దర్శనం & ఆర్జిత సేవల బుకింగ్.
 10. TTD కల్యాణమండపం ఆన్లైన్ బుకింగ్
 11. TTD బోర్డు యొక్క లీజ్ మరియు రెంట్స్ ఆన్లైన్ పేమెంట్.
 12. తిరుమల కల్యాణ వేదిక స్కీం రిజిస్ట్రేషన్ – తిరుమల సామూహిక వివాహం స్కీం.

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు 2022:

శ్రీనివాసుని ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొనటానికి ఎక్కువ మక్కువ చూపుతుంటారు. ప్రతినిత్యం ఆగమ శాస్త్రము ప్రకారం శ్రీవారి మూలవిరాట్టుకు, భోగ శ్రీనివాసమూర్తికు, శ్రీదేవి-భూదేవి సామెత మలయప్ప స్వామికు వివిధ ఆర్జిత సేవలు కైంకర్యం చేస్తుంటారు. ఆర్జిత సేవల టికెట్స్ ఆన్లైన్ ద్వారా భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైటులో బుక్ చేసుకోగలరు.

కొన్ని ఆర్జిత సేవలకు శ్రీవారి అంతరాలయం దర్శన భాగ్యం కల్పిస్తారు. కొన్ని సేవలకు సామాన్య దర్శనం కల్పిస్తారు.

సేవ పేరు రోజు సమయం
సుప్రభాత సేవ ఆదివారం-శనివారంఉ!!- 2:30 గం!!లకు
తోమాల సేవ మంగళ, బుధ, గురువారలు మాత్రమే.ఉ!!- 3:00 గం!!లకు
సహస్రనామార్చన సేవ మంగళ, బుధ, గురువారలు మాత్రమేఉ!!- 3:30 గం!!లకు
చతుర్దశ కలశ విశేష పూజ సోమావరం మాత్రమే.ఉ!!- 6:00 గం!!
అష్టదళ పాద పద్మారాధనముమంగళవారం మాత్రమే. ఉ!!- 5:00 గం!!లకు
సహస్ర కలశ అభిషేకంబుధవారం మాత్రమే.ఉ!!- 5:00 గం!!లకు
తిరుప్పావడ సేవ గురువారం మాత్రమే. ఉ!!- 5:00 గం!!లకు
పూరాభిషేకం శుక్రవారం మాత్రమే. ఉ!!- 4:00 గం!!లకు
నిజపాద దర్శనం శుక్రవారం మాత్రమే. ఉ!!- 5:30 గం!!లకు
కల్యాణోత్సవం సేవ ఆదివారం-శనివారంఉ!!- 10:30 గం!!లకు
ఆర్జిత బ్రహ్మోత్సవం ఆదివారం-శనివారంమ!!- 1:00 గం!!లకు
ఊంజల్ సేవ / డోలోత్సవం ఆదివారం-శనివారంమ!!- 12:30 గం!!లకు
ఆర్జిత వసంతోత్సవం ఆదివారం-శనివారంమ!!- 2:00 గం!!లకు
సహస్రదీపాలంకరణ సేవ ఆదివారం-శనివారంసా!!- 5:30 గం!!లకు
ఏకాంత సేవ ఆదివారం-శనివారంరా!!- 11:30 గం!!లకు
మెల్చట్ వస్త్రం /
వస్త్రాలంకరణ సేవ
శుక్రవారం మాత్రమే. ఉ!!- 5:00 గం!!లకు
శ్రీవారి తెప్పోత్సవం
వసంతోత్సవం సేవ
పద్మావతి పరిణయం సేవ
అభిధేయక అభిషేకం
పుష్పపల్లకి సేవ
పుష్పయాగం
కొయిలాళ్వార్ తిరుమంజనం
పారువేట ఉత్సవం
పవిత్రోత్సవం

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు ఏప్రిల్ మే జూన్ 2022 టికెట్స్ విడుదల:

యావత్ భక్తులకు ఒక మంచి వార్త అందించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. 2020 మర్చి నెలలో ఆగిపోయిన శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి పునఃప్రారంభం చేస్తున్నారు. ఇంత మునుపు ఎటువంటి ఆన్లైన్ బుకింగ్ పద్దతి ఉండేదో ఆ పద్దతే తిరిగి కొనసాగుతుంది.

మార్చ్ 20వ తారీకున ఉదయం 10:00 నుండి 22 మార్చ్ 10:00 AM వరకు ఆన్లైన్ లో సుప్రభాత దర్శనం సేవ, తోమాల సేవ, అర్చన, నిజపాద దర్శనం, అష్టదళ పాదపద్మారాధనం సేవ టికెట్స్ కోసం భక్తులు టీటీడీ ఆర్జిత సేవ లక్కీ డిప్ నందు రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు తిరుమల ఆర్జిత సేవ లక్కీ డిప్ 2022 పేజీ ని చూడండి.

కల్యాణోత్సవం మొదలుకొని మిగిలిన ఆర్జిత సేవలను యధాతధంగా ఆన్లైన్ లో ఒక యూసర్ గా రిజిస్టర్ అయ్యి యాత్రికులు బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు తిరుమల ఆర్జిత సేవ ఆన్లైన్ బుకింగ్ పేజీ ని చూడండి. ఆర్జిత సేవలు పొందిన వారు తిరుమలలో వసతి గదుల రిజర్వేషన్ కొరకు తిరుమల రూమ్స్, కాటేజీలు, గెస్ట్ హౌస్ ఆన్లైన్ బుకింగ్ పేజీని చూడండి.